ట్రైకార్ సబ్సిడీ నిధులను విడుదల చేయాలి

Tricar subsidy funds should be releasedనవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
రాష్ట్రవ్యాప్తంగా 265 కోట్లు పెండింగ్ ట్రైకార్ సబ్సిడీ నిధులను విడుదల చేసి కొత్త యాక్షన్ ప్లాన్ విడుదల చేయాలని ఆదివాసి గిరిజన సమాఖ్య జిల్లా కన్వీనర్ మెస్రం భాస్కర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 32,122 లబ్ధిదారులకు 265 కోట్లు పెండింగ్ లో ఉన్న ట్రైకార్ సబ్సిడీ రుణాలను లబ్ధిదారులకు  విడుదల చేసి నూతన యాక్షన్ ప్లాన్ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమలు తెలంగాణ ఆదివాసి గిరిజన సమాఖ్య గా నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ ఏవోకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కోకన్వినర్ గేడం పోచ్చిరం, చాహకటి కిరణ్, మాడవి అనిల్, సాయి, మహేష్, సునీల్, సందీప్, పాల్గొన్నారు.