– ఆమనగల్లు లైన్స్ క్లబ్ అధ్యక్షుడు
– శుద్ధపల్లి సర్పంచ్ యాచారం వెంకటేశ్వర్లు గౌడ్
– జ్ఞానపథం ఆధ్వర్యంలో మండల స్థాయి ముగ్గుల పోటీలకు విశేష స్పందన
నవతెలంగాణ-మాడ్గుల
మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ముగ్గుల పోటీలు ఎంతగానో ఉపయోగప డతాయని ఆమనగల్లు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు, సుద్దపల్లి సర్పంచ్ యాచారం వెంకటేశ్వర్లు గౌడ్ అన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణంలో జ్ఞాన పథం సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి ముగ్గుల పోటీలు విశేష స్పందన లభించింది. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన మహిళలు విద్యార్థులు అధిక సంఖ్యలో పోటీలో పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యాచారం వెంకటేశ్వర్లు గౌడ్, మాజీ ఎంపీపీ అన్నపాక జంగయ్య, మాజీ సర్పంచి కాట్ల యాదయ్య గౌడ్, ఉపసర్పంచ్ మిద్ద రాములు, వార్డ్ మెంబర్ చిక్కుడు లక్ష్మమ్మ, గౌని అరవింద్ గౌడ్, డి.ఎస్.ఓ ధారా రాములు, టీచర్ నరసింహ, చిక్కుడు జంగయ్య, మహాదేవ శర్మ, ఫీల్డ్ అసిస్టెంట్ ముద్దం కష్ణ పాల్గొని బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మొదటి బహుమతి ప్రియాంక (మాడుగుల) బహుమతి రూ.10వేలు, రెండవ బహుమతి ఈర్ల చైతన్య (నాగిళ్ల) రూ.5వేలు, తృతీయ బహుమతి మనీషా (మాడ్న్నుగుల) గెలుచుకున్నారు. అదేవిధంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ ప్రైస్ అందజేశారు. పోటీలకు న్యాయనిర్నేతలుగా హైమవతి, టెల్లి హల్సన వ్యవహరించారు. కార్యక్రమంలో జ్ఞాన పథం ఫౌండర్, చైర్మన్ మొగిళ్ళ చిన్నిక్రిష్ణ, ప్రవీణ్ ,గును,పులికంటి శేఖర్,కట్ట వెంకటేష్,గిరి తెలుగమల్ల,యాదగిరి పాల్గొన్నారు.