మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ముగ్గుల పోటీలు ..

Triathlon competitions in Women's Polytechnic College..నవతెలంగాణ – కంఠేశ్వర్ 
రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ ఆధ్వర్యంలో గురువారం సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిజామాబాదు మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించారు.విద్యార్థినిలు ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు.ఉత్తమంగా ఎంపికైన ముగ్గులు వేసిన ముగ్గురికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు మరో పదిమందికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు ‌.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అనురాధ,రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ అద్యక్ష కార్యదర్శులు పద్మ శ్రీనివాస్ గుప్తా, గౌరీ శంకర్, ప్రాజెక్ట్ చైర్మన్ కోటగిరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.