నవతెలంగాణ -ముధోల్ : సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన లో శనివారం జరిగిన తెలంగాణలో గల విశ్వవిద్యాలయాల వీసీల సమావేశంలో బాసర ట్రిపుల్ ఐటీ వీసీ గోవర్ధన్ పాల్గొన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ తో పాటు అన్ని యూనివర్సిటీల వీసీ లు సిఎం రేవంత్ రేడ్డి ని హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యామండలి, వీసీలకు. సిఎం దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బాసర ట్రిపుల్ ఐటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ ఆర్జీయూకేటీ బాసర పరిస్థితులపై సమగ్ర అధ్యయనం చేసి ప్రమాణాలను పెంచే చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.