ఆర్డీవో కార్యాలయం ముందు భోజనం చేస్తున్న త్రిబుల్ ఆర్ బాధితులు

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్: బాధితులు రైతులు చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయం ముందు కూర్చుని నిరసనగా అక్కడే భోజనం చేశారు.సోమవారం చౌటుప్పల్ ఆర్డిఓ కార్యాలయానికి రాకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ త్రిబుల్ ఆర్ బాధితులు ధర్నా నిర్వహించారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో పోవాల్సిన అలైన్మెంట్ 28 కిలోమీటర్లకు తగ్గించి చౌటుప్పల్ పట్టణాన్ని రెండు భాగాలుగా విడగొట్టారని నిరసిస్తూ గత నెల రోజులుగా ఆర్డిఓ ఎంఆర్ఓ కలెక్టర్ మంత్రి ఎమ్మెల్యేలు చుట్టూ తిరిగిన లాభం లేదని విస్తూపోయి ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.అప్పటికి ఆర్డీవో రాకపోవడంతో మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికైనా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్రిబుల్ ఆర్ బాధితులను పట్టించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో డబ్బేటి రాములు గౌడ్ సందగల్ల మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.