చౌటుప్పల్ మండల రీజనల్ రింగ్ రోడ్డు భూనిర్వాసిత రైతులు,ప్లాట్ల యజమానులు కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్ ని హైదరాబాదులో బుధవారం చౌటుప్పల్ సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో కలిశారు. ఈ సందర్భంగా రైతులు నార్త్ సైడ్ త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ నీ ORR నుండి 28 కిలోమీటర్ల కి పరిమితం చేశారని, దీనివలన చౌటుప్పల్ భువనగిరి గజ్వేల్ మున్సిపాలిటీలు రెండు మూడు భాగాలుగా విడిపోతున్నాయని చింతల దామోదర్ రెడ్డి బండి సంజయ్ న వివరించారు. 40 కిలోమీటర్లకు అలైన్మెంట్ మార్చితే మున్సిపాలిటీ విడిపోకుండా గ్రామీణ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. మున్సిపాలిటీ లోని భూముల ఎకరానికి బహిరంగ మార్కెట్ వాల్యూ సుమారుగా 2,5 కోట్లు,హెచ్ఎండిఏ ప్లాట్లు గజానికి సుమారుగా 20వెలు ఉండగా,ప్రభుత్వం మాత్రం నష్టపరిహారము ఎకరాకి 20 నుంచి 30 లక్షలు,హెచ్ఎండి ప్లాట్లలో గజానికి 5-6 వేలు వరకే ఇస్తా మంటున్నారని బండి సంజయ్ కి వివరించారు. గతంలో తమ భూములను ప్రభుత్వ ప్రాజెక్టులు అయిన నేషనల్ హైవేల కోసం,విద్యుత్ స్తంభాల కోసం మరియు నీటి కాలువల కోసం కోల్పోయామని, ఇప్పుడు త్రిబుల్ ఆర్ వలన ఉన్న కాస్త భూమి కోల్పోతున్నామని దీని వలన రైతులు బిచ్చగాళ్ళు అయిపోయే పరిస్థితి వచ్చిందని బండి సంజయ్ ఎదుట రైతులు వాపోయారు.సౌత్ సైడు త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ ఓఆర్ఆర్ నుండి 40 కిలోమీటర్లకు చేస్తున్నట్లుగా నార్త్ సైడ్ అలైన్మెంట్ ని కూడా శాస్త్రీయబద్ధంగా 40 కిలోమీటర్లుకి మార్చాలని లేదా బహిరంగ మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం ఇస్తూ జీవనోపాధి ఇప్పించాలని కోరారు. త్రిబుల్ ఆర్ బాధితుల గోడును విన్న మంత్రి బండి సంజయ్ సానుకూలంగా స్పందిస్తూ దీనిపైన విచారణ జరిపి రైతులకు తగు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ గంగిడి మనోహర్ రెడ్డి,భూ నిర్వాసితులు సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి చౌటుప్పల్ మాజీ జెడ్పిటిసి పెద్దిటి బుచ్చిరెడ్డి బిజెపి మండల నాయకులు గుజ్జుల సురేందర్ రెడ్డి,మరుపాక లింగం గౌడ్ కౌన్సిలర్ గోపగోని లక్ష్మణ్ గౌడ్,చింతల సుధాకర్ రెడ్డి,ప్రభాకర్ రెడ్డి,జాల శ్రీశైలం యాదవ్,జాల జంగయ్య యాదవ్, జాల వెంకటేష్ యాదవ్ జాల నరసింహ గుండె బోయిన గాలయ్య,వేణు యాదవ్,భోగయ్య, ప్రకాష్ రెడ్డి,జోసెఫ్,కార్తీక్,కనకరాజు ,యాదయ్య తదితరులు పాల్గొన్నారు.