ముగ్గులు సాంప్రదాయానికి ప్రతీక

– డీవైఎఫ్‌ఐ జిల్లా మాజీ అధ్యక్షులు కీలుకాని లక్ష్మణ్‌
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్‌
ముగ్గులు సంప్రదాయానికి ప్రతీక అని కీలుకానీ లక్ష్మణ్‌ అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా డివైఎఫ్‌ఐ ఐద్వా, సీఐటీయూ, ఆధ్వర్యంలో షాపూర్‌ నగర్‌ ప్రభుత్వ పాఠశాలలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ జిల్లా మాజీ అధ్యక్షులు కీలుకాని లక్ష్మణ్‌, మహిళా సంఘం మండల కార్యదర్శి ఆర్‌.స్వాతి, డివైఎఫ్‌ఐ జిల్లా నాయకులు పసుల అంజయ్య మాట్లాడుతూ..చాలా సంవత్సరాలుగా సంక్రాంతి సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించడం అన వాయితీగా వస్తుందని అన్నారు. ఈ పోటీలలో ఈ ప్రాంతంలో ఉన్న యువతి, యువకులు ఉత్సాహంగా పాల్గొని జయప్రదం చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహిళా సంఘం డివైఎఫ్‌ఐ, సీఐటీయూ ఆటల పోటీలు మాత్రమే కాకుండా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, బ్రూణహత్యల పై దేశవ్యాప్తంగా సమరశీల పోరాటాలు చేయాలన్నారు. మహిళల్ని, యువకుల్ని, కార్మికుల్ని ఐక్యత పోరాటం అనే నినాదంతో భగత్‌ సింగ్‌ ఆశయలాను ముందుకు తీసుకెళ్తూ మా దేహం ముక్కలైన ఈ దేశాన్ని ముక్కలు కానీయం అనే నినాదంతో ముందుకెళ్లాలని పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం పాలక ప్రభుత్వాలకు గుర్తు చేస్తూ ఉగ్రవాదానికి, మతోన్మాదానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ ముందుకె ళ్లడం జరుగుతుందన్నారు. రానున్న కాలంలో ప్రజా సంఘాలు చేసే పోరాటానికి యువతి, యువకులు మద్దతు తెలపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయ కురాలు జమున, కొమరమ్మ, డివైఎఫ్‌ఐ నాయకులు నాగరాజు, పాషా, జయరాజ్‌, లక్ష్మణ్‌, సీఐటీయూ నాయకులు కరుణాకర్‌ పాల్గొన్నారు.