నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి టి.అమర్‌నాథ్‌గౌడ్ గురువారం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. అక్కడ ఆయన సాధారణ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం నిమ్స్ డైరెక్టర్ బీరప్పను కలిసి ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీసి, సంతృప్తిని వ్యక్తం చేశారు.