త్రీసా-గాయత్రి జోడీ ఓటమి

త్రీసా-గాయత్రి జోడీ ఓటమి– డెన్మార్క్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ
ఒడెన్సె(డెన్మార్క్‌) : డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌-750లో భారత షట్లర్ల ఓటముల పరంపర కొనసాగుతోంది. తొలిరోజు లక్ష్యసేన్‌, మాల్విక, ఆకర్షీ కశ్యప్‌, పాండా సిస్టర్స్‌ నిష్క్రమించగా.. రెండోరోజు కరుణాకరన్‌, త్రీసా జోలీ-గాయత్రీ జంట పరాజయాన్ని చవిచూశాడు. బుధవారం జరిగిన తొలిరౌండ్‌ పోటీలో గాయత్రి గోపీచంద్‌-త్రీసా జోలీ జంట 21-19, 17-21, 15-21తో మలేషియా జంట చేతిలో పోరాడి ఓడారు. ఇక పురుషుల సింగిల్స్‌లో కరుణాకరన్‌ 15-21, 21-17, 20-22తేడాతో చైనీస్‌ తైపీకి చెందిన ఎల్‌.వై. సూ చేతిలో ఓటమిపాలయ్యాడు.