క్వార్టర్స్‌కు త్రీషా-గాయత్రి జోడీ

– ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ
లండన్‌: ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల డబుల్స్‌లో త్రీషా జోలీ-గాయత్రీ గోపీచంద్‌ జోడీ హవా కొనసాగుతోంది. గురువారం జరిగిన ప్రి క్వార్టర్స్‌ పోటీలో త్రీషా-గాయత్రి జోడీ 21-14, 24-22తో జపాన్‌కు చెందిన హిరోటా-ఫుకుషిమాపై విజయం సాధించారు. క్వార్టర్‌ఫైనల్లో భారత మహిళల జోడీ చైనా టాప్‌సీడ్‌ జోడీతో తలపడనుంది. ఇక పురుషుల డబుల్స్‌లో భారత స్టార్‌ షట్లర్లు చిరాగ్‌శెట్టి-సాత్త్విక్‌ సాయిరాజ్‌ రంకిరెడ్డి జోడీ పోరాటం ప్రి క్వార్టర్స్‌కు ముగిసింది. చిరాగ్‌-సాత్త్విక్‌ జోడీ 21-19, 17-21, 19-21తో చైనాకు చెందిన లియాంగ్‌-వాంగ్‌ చేతిలో పోరాడి ఓడారు. మరో డబుల్స్‌ జోడీ అర్జున్‌-ధృవ్‌ కపిల 16-21, 15-21తో చైనా జంట చేతిలోనే పరాజయాన్ని చవిచూశారు.