పది ఫలితాల్లో త్రివేణి స్కూల్‌ ప్రభంజనం

– వంద శాతం ఉత్తీర్ణతతో తనకు తానే సాటి
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
ఉన్నత శ్రేణి విద్యా ప్రమాణాలతో, క్రమశిక్షణ కలిగిన విద్యాభోదనతో త్రివేణి ట్యాలెంట్‌ స్కూల్‌ యాజమాన్యం విద్యా ర్థులను ఉత్తమ ఫలితాలు సాధించేలా తీర్చి దిద్దుతున్నారు. మియాపూర్‌ మైత్రినగర్‌లో గల త్రివేణి స్కూల్‌ బ్రాంచ్‌లో ఈ సం వత్సరం జరిగిన పదో తరగతి పరీక్షలో 11 మంది విద్యార్థులు కే. లీలాసాయి చరణ్‌, కే.ప్రణవి, గల్ల పూజ్య, బసవరాజు శ్రీహిత, కడలి అర్జున దేవి, రూపాని దీక్షిత, కృతిక శ్రీ మహా, కే. హిమేంద్ర సాయి, కే.శ్రీ హర్షిత, ఎస్‌.వెంకటసాయి తన్మయి, కౌండిన్య, టి.కీర్తి సాయి తేజస్వి లు 10/10 జీపీఏ ర్యాంకు సాధించి సత్తా చాటారు. వంద శాతం 10/10 ర్యాంకులు సాధించిన విద్యా ర్థులను స్కూల్‌ డైరెక్టర్‌ జి.వీరేంద్ర చౌదరి, అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందిం చారు. ఈ సందర్భంగా అయన మాట్లాడు తూ క్రమశిక్షణతో కూడిన విద్యనంధించిన అధ్యాపకులు, సెంటర్‌ హెడ్‌ సాయి నర్సిం హారావు, ప్రిన్సిపాల్‌ లక్ష్మి ప్రసన్న, హాస్టల్‌ ప్రిన్సిపాల్‌ జగదీశ్వర్‌ రావులు అంకిత భావంతో పని చేస్తున్నారని కొనియాడారు. ఆకుటింత దీక్ష, పట్టుదలతో చదివిన విద్యార్థులు తాము అ నుకున్న లక్ష్యాలను చేరుకున్నారని, ఇదే స్ఫూర్తితో ముందు ముందు మరిన్ని ర్యాంకులు సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. చదు వుకున్న చదువు వృథా కాకుండా మంచి ఆలోచనలతో, తాము ఎంచుకున్న రంగాల్లో స్థిరపడి సమాజానికి సేవ చేయా లనీ, తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.