
చౌటుప్పల్ పట్టణానికి చెందిన సాయి స్పోర్ట్స్ క్లబ్ విద్యార్థులు ఈనెల 25,26 బెంగళూరులో జరిగిన జాతీయస్థాయి తైక్వాండో పోటీలో 16 మంది విద్యార్థులకు పథకాలు లభించాయి.పది మంది బంగారు పతకాలు, ఆరుగురు రజిత పథకాలు లభించాయని కోచ్ నందగిరి శివ సాయి మంగళవారం తెలిపారు.తెలంగాణ క్యాతిని మరింత ప్రదర్శించాలని ఏసీపీ మధుసూదన్ రెడ్డి అన్నారు.జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన విద్యార్థులకు చౌటుప్పల్ ఏసిపి పటోళ్ల మధుసూదన్ రెడ్డి అభినందించారు. చౌటుప్పల్ విద్యార్థులు జాతీయస్థాయిలో పథకాలు ట్రోఫీని సాధించడం గర్వకారణంగా ఉందని ఏసీపీ మధుసూదన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ జి మన్మధ కుమార్ సాయి స్పోర్ట్స్ క్లబ్ ఇన్స్ట్రకర్ రిషికేష్ హేమంత్ మత్స్యగరి ప్రణీత్ తూర్పునూరి మల్లేష్ గౌడ్,అంతటి రాజేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.