వీఆర్‌ఏ, వీఆర్వోల సమస్యలను పరిష్కరించండి

Resolve VRA and VRO issues– ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వీఆర్‌ఏ, వీఆర్వోల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మెన్‌ వి.లచ్చిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం షామీర్‌పేట్‌ మండలం తూంకుంటలో తెలంగాణ పూర్వ వీఆర్వోల సంక్షేమ సంఘం రాష్ట్ర ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో వీఆర్వోల పాత్ర వెలకట్టలేనిదని అన్నారు. వీఆర్వోలు గ్రామీణ ప్రాంతాల్లో రెవిన్యూ వ్యవస్థకు పట్టు కొమ్మలుగా సేవలందించారని గుర్తు చేశారు. గత సర్కార్‌ వారిని చిన్నాభిన్నం చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాది క్రితం రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి నేతృత్వంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ సర్కార్‌ వీఆర్‌ఏ, వీఆర్వో వ్యవస్థల పునరుద్ధరణకు సుముఖంగా ఉందని చెప్పారు. త్వరలో విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సింగారం రాములు, రమేష్‌ పాక, పూల్‌ సింగ్‌ చౌహన్‌, మహిళా అధ్యక్షురాలు పి. రాధ, తెలంగాణ పూర్వ వీఆర్వోల సంక్షేమ సంఘం రాష్ట్ర అద్యక్షులు గరికె ఉపెందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.