న్యూఢిల్లీ : డిజిటల్ కమ్యూనికేషన్ మోసాల నుంచి వినియోగదారులకు మెరుగైన రక్షణ కల్పించే లక్ష్యంతో అంతర్జాతీయ కమ్యూనికేషన్ సంస్థ ట్రూకాలర్‌తో హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఫ్రాడ్ ఇన్సూరెన్స్ పథకాన్ని విడుదల చేశాయి. ఈ ఫ్రాడ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తి అండ్రాయిడ్, ఐఒఎస్ యూజర్లకు రూ.10,000 వరకు కవరేజ్ అందిస్తుందని హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో పేర్కొంది. ఈబ సమగ్ర బీమా పథకం డిజిటల్ కమ్యూనికేషన్స్ మోసాల నుంచి రక్షణతో పాటు ఆర్థిక సమిష్ఠితత్వాన్ని ప్రోత్సహిస్తుందని హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ప్రతినిధి వికాస్ సికండ్ పేర్కొన్నారు.