ఇరాన్‌ అణు కేంద్రాలపై దాడి చేయండి : ట్రంప్‌

వాషింగ్టన్‌ : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ చేసిన క్షిపణి బారేజీకి ప్రతిస్పందనగా ఇరాన్‌ యొక్క అణు కేంద్రాలపై ఇజ్రాయెల్‌ దాడి చేయాలని ఆయన పేర్కొన్నారు. నార్త్‌ కరోలినాలో జరిగిన ప్రచార కార్యక్రమంలో ట్రంప్‌ మాట్లాడుతూ ఇటీవల డెమొక్రాటిక్‌ అధ్యక్షుడు జో బైడెన్‌ను విలేకరులు అడిగిన ప్రశ్నను ప్రస్తావించారు. ఇరాన్‌ అణు కేంద్రాలపై దాడులకు మద్దతు ఇస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ”సమాధానం లేదు” అంటూ బైడెన్‌ అన్నారని తెలిపారు. అదే ప్రశ్న తనను అడిగితే అణు కేంద్రాలపై దాడులు చేసి, తరువాత మిలిగిన వాటి గురించి విచారిద్దామని చెబుతానని పేర్కొన్నారు.