టీఎస్ డ్లుఅర్ సైనిక్ స్కూల్ సెట్ – 2024 ప్రవేశ పరీక్ష ఈ నెల 10న నిర్వహణ..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక్ పాఠశాల, ( సిబిఎస్ బి), రుక్మాపూర్, కరీంనగర్ జిల్లాలో 2024 -25 సంవత్సరానికి 6వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశానికి సంబంధించిన ప్రవేశ పరీక్ష సైనిక్ స్కూల్ సెట్ -2024 ఈ నెల 10 (ఆదివారం) 6వ తరగతికి ఉదయం 10 గంటల నుండి మద్యాహ్నం 12:30 వరకు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గం. వరకు ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాలు, నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల, జూనియర్ కళాశాలలో బాలికలు డిచ్ పల్లి మండలం లోని సుద్దపల్లి లో, కామారెడ్డి జిల్లాలో దోమకొండ, నిర్మల్ జిల్లాలో జామ్ లలో నిర్వహించబడుతుందని ఆ సంస్థ ప్రాంతీయ సమన్వయాధికారిణి కె. అలివేలు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల హాల్ టికెట్ లు అంతర్జాలంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అభ్యర్థులు www.tswreis.ac.in వెబ్ సైట్ ల ద్వారా అంతర్జాలం నుండి హాల్ టికెట్ లు ముందుగానే డౌన్ లోడ్ చేసుకొని ప్రవేశ పరీక్షకు సకాలంలో హాజరుకావలని సూచించారు. పరీక్ష సమయానికి గంట ముందుగా పరీక్షాకేంద్రానికి అభ్యర్థులు చేరుకోవాలని పేర్కొన్నారు. తమ వెంట పరీక్ష ప్యాడ్, రెండు బ్లూ /బ్లాక్ బాల్ పాయింట్ పెన్నులు, హాల్ టికెట్ పరీక్షా కేంద్రానికి తీసుకవెళ్లాలని ఆలస్యం అయినచో అనుమతించబడరని సూచించారు. తప్పనిసరిగా పరీక్షాకేంద్రాన్ని ఒకరోజు ముందుగానే సందర్శించి నిర్ధారించుకోవాలని వివరించారు. పరీక్షాకేంద్రాలను గుర్తిచడంలో ఏవైనా ఇబ్బందులుంటే, హాల్ టికెట్ లో ముద్రించిన ముఖ్య పర్యవేక్షకుని ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చని నిజామాబాద్ రీజియన్ ప్రాంతీయ సమన్వయాధికారిని అలివేలు, తెలిపారు.