TS News: మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన బంధువులకు ఐటీ నోటీసులు.. నేడు విచారణ

హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) ఆస్తుల కేసు (Assets case)లో సోమవారం నుంచి ఐటీ అధికారులు (IT Officers) విచారణ చేపట్టనున్నారు.

ట్టనున్నారు. మంత్రితో పాటు ఆయన బంధులు 16 మందికి నోటీసులు (Notices) జారీ చేసిన అధికారులు.. సోదాల్లో లభ్యమైన రసీదులు, దస్త్రాలు, నగదుపై ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో మల్లారెడ్డి ఇచ్చిన అఫిడవిట్‌పై విచారణ జరిగే అవకాశముంది. అయితే మంత్రి తరఫున ఆయన చార్టెడ్ అకౌంటెంట్ హాజరుకానున్నట్లు సమాచారం. దాదాపు మూడు రోజులపాటు విచారణ జరిగే అవకాశముంది.

 

ఆరు రోజుల క్రితం మంత్రి మల్లారెడ్డి నివాసం, కార్యాలయాలపై అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారుడు, అల్లుడుకు సంబంధించిన ఇళ్లు, సంస్థల్లో సోదాలు చేసిన తర్వాత కొన్ని కీలక పత్రాలతోపాటు భారీగా నగదును సీజ్ చేశారు. కాగా మల్లారెడ్డి చిన్న కుమారుడు, కోడలు కూడా ఇవాళ విచారణకు హాజరయ్యే అవకాశమున్నట్లు సమాచారం.