నవతెలంగాణ – ఆళ్ళపల్లి
రాష్ట్ర ప్రభుత్వం ఉపాద్యాయులకు ఓల్డ్ పెన్షన్స్ స్కీం అమలు చేయాలని, టీచర్ల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఎస్.జీ.టీలకు సైతం ఓటు హక్కు కల్పించాలని 108 రోజుల పాటు ఫలాహార దీక్ష చేస్తున్న ఆళ్ళపల్లిలోని జాకారం గ్రామం ఎంపీపీఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రకృతి ప్రేమికులు, ఫ్రూటేరియన్ ఎస్.ఎం.పాషకు స్థానిక టీఎస్ టీటీఎఫ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి లావుడ్య రాందాస్ బుధవారం సంపూర్ణ మద్దతును ప్రకటించారు. బోడాయికుంట గ్రామంలోని పాఠశాలలో ఎల్.ఎఫ్.ఎల్ హెచ్.ఎం. గా విధులు నిర్వహిస్తున్న రాందాస్ తో పాటు పాతూరు గ్రామంలోని ఎంపీపీఎస్ లో హెచ్.ఎం. గా విధులు నిర్వహిస్తున్న అశోక్ సైతం ఫలాహార దీక్షకు సంఘీభావం తెలిపారు. ఇరువురు దీక్ష పూర్తయ్యే వరకు ఎస్.ఎం.పాషాకు అన్ని రకాలుగా సహాయ , సహకారాలు అందిస్తామని వారు పేర్కొన్నారు. టీఎస్ టీటీఎఫ్ సంఘం నాయకులు తనకు మద్దతు తెలపడం పట్ల పాషా హర్షం వ్యక్తం చేశారు.