
హాలియా లో టీఎస్ పీఆర్టీయూ సభ్యత్వ కార్యక్రమం లో భాగంగా స్థానిక కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయ లో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమం లో ముఖ్య అతిథిగా నల్లగొండ జిల్లా టీఎస్ పీఆర్టీయూఅధ్యక్షులు శ్రీ డి వి ఎస్ ఫణి కుమార్ హాజరైనారు. అనంతరం ఉపాధ్యాయినులద్దేశించి మాట్లాడుతూ కె జి బి వి పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పి ఆర్ టి యు టి ఎస్ అంకిత భావంతో కృషి చేస్తుందని, కరోనా కాలం లో పన్నెండు నెలల వేతనాలు ఇప్పించడం లో, ఉపాధ్యాయినిలకు చైల్డ్ కేర్ సెలవులు ఇప్పించడం లో, మరియు ప్రస్తుతం ఉపాధ్యాయినులకు మినిమం టైం స్కేల్ ఇప్పించేందుకు పి ఆర్ టి యు టి ఎస్ తీవ్రంగా కృషి చేస్తున్నదని రాష్ట్రంలో ఉపాధ్యాయుల సంక్షేమం కోసం,అన్ని రకాల సమస్యల పరిష్కారం కోసం, నిరంతరం కృషి చేస్తున్న ఏకైక సంఘం పి ఆర్ టి యు టి ఎస్ అని జిల్లా అద్యక్షులు ఫణి కుమార్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ముఫ్ఫై వేల మందికి పైగా ఉపాధ్యాయులకు వివిధ కేడర్లలలో పదోన్నతి కల్పించి ఉపాధ్యాయుల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి కి పి ఆర్ టి యు టి ఎస్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో అనుముల మండల పి ఆర్ టి యు టి ఎస్ అధ్యక్షులు చెన్ను వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి మంచికంటి మధు, మాజీ ప్రధాన కార్యదర్శి జానారెడ్డి,కె జి బి వి ఎస్ ఓ కె హైమావతి,చింతల వెంకటేశ్వర్లు, మందా సైదులు రావు గౌతమ్, సక్రు నాయక్, రామచంద్ర రెడ్డి, నామిరెడ్డి వెంకటరెడ్డి పాంపాటి అరవింద్, అహ్మద్,నోవా, లోక్ నాథ్,నలబోతు వెంకన్న, నరసింహారెడ్డి,కె జి బి వి ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.