– సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి ఘనస్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు
– కడ్తాల్ నుంచి ఆమనగల్, వెల్దండ మీదుగా కల్వకుర్తి వరకు భారీ ర్యాలీ
– అధైర్య పడవద్దు ఆదుకుంటానని హామీ
నవతెలంగాణ-ఆమనగల్
గతంలో ఎన్నడూ లేని విధంగా ఐక్యత ఫౌండేషన్ చైర్మెన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కాంగ్రెస్‌ల చేరిన సంద ర్భంగా ఆపార్టీ నాయకులు శుక్రవారం చేపట్టిన స్వాగతో త్సవ ర్యాలీ కల్వకుర్తి నియోజకవర్గంలో సునామీని తలపిం చేలా కొనసాగింది. ఐక్యత ఫౌండేషన్ పేరుతో నియోజ కవర్గంలో అతి తక్కువ సమయంలో ప్రతి గ్రామానికి పరి చయమైన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గత సోమవారం రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, వంశీచంద్ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏఐసీసీ ముఖ్య నాయకుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడంతో కల్వకుర్తి నియోజకవర్గ రాజకీ యాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈనేపథ్యంలో కాం గ్రెస్‌లో చేరిన అనంతరం తొలిసారి నియోజకవర్గానికి వి చ్చేసిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఈసందర్భంగా ఊరు వాడా అనే తేడాలేకుండా కడ్తాల్ మండల కేంద్రము నుంచి శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి గుండా ఆమనగల్, వెల్దం డ మీదుగా కల్వకుర్తి వరకు సాగిన సుంకిరెడ్డి ర్యాలీకి పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు అడుగు అడుగునా గజమాలలు, శాలువాలతో సన్మానిస్తూ బ్రహ్మరథం పట్టా రు. ర్యాలీలో భాగంగా మైసిగండి అమ్మవారి ఆలయంలో సుంకిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఆమనగల్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి, అమరవీ రుల స్థూపానికి, రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కల్వకుర్తి పట్టణంలో జరిగిన ర్యాలీ ముగింపు సమావేశంలో సుంకిరెడ్డి రాఘ వేందర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలు పునిచ్చారు. ఆపద సమయాల్లో ఎవరు అధైర్యపడవద్దని వారిని ఆదుకోవడానికి తాను స్థాపించిన ఐక్యత ఫౌండేషన్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐక్యత ఫౌండేషన్ ఎక్జిక్యూటివ్ మెంబర్ సుంకిరెడ్డి వరప్రసాద్ రెడ్డి, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, సుంకిరెడ్డి అభిమానులు పాల్గొన్నారు.