టీఎస్ యూటిఎఫ్ గుండ్లపల్లి నూతన కమిటీ ఎన్నిక

నవతెలంగాణ – డిండి
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ గుండ్లపల్లి (డిండి) మండల  మహాసభలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల డిండిలో బుదవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జిల్లా ఎఫ్.డబ్లు.ఎఫ్ కన్వీనర్  గేర నర్సింహ్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూసీసీఎస్ ని రద్దుచేసి, పాత పెన్షన్ అమలు చేయాలని, బదిలీలు, ప్రమోషన్లను చేపట్టాలని, పెండింగ్ లో ఉన్న డి ఏ లను విడుదల చేయాలని, బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తదుపరి గుండ్లపల్లి మండల శాఖ ఎన్నికను ఎన్నికల అధికారి గిరి యాదయ్య ఆధ్వర్యంలో జరిగాయి. గుండ్లపల్లి మండల అధ్యక్షులుగా గండమల్ల రామారావు, ప్రధాన కార్యదర్శిగా పవన్ నారోజు, ఉపాధ్యక్షులుగా కాంపల్లి జయరాజు, మహిళా ఉపాధ్యక్షురాలుగా ఎం. సుజాత, కోశాధికారిగా వి.శ్రీనయ్య, మహిళా కన్వీనర్ గా ఉషారాణి, ఎఫ్.డబ్లూ.ఎఫ్  కన్వీనర్ గా బి.యాదయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ సీనియర్ నాయకులు, డిండి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీమతి పెంటావతి, సీనియర్ నాయకులు రాజేందర్ రెడ్డి, లచ్చిరాం, మురళి, అంజయ్య, ధనలక్ష్మి, యాదయ్య, జ్యోతి, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.