టీఎస్ యూటీఎఫ్ మండల కమిటీ ఎన్నిక

నవతెలంగాణ – రాయపర్తి
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మండల మహాసభ కమిటీని బుధవారం మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడు తాటికాయల కుమార్ ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు. మండల అధ్యక్షుడిగా బి వెంకటేశ్వర్ రావు (కొత్తూరు పాఠశాల), ఉపాధ్యక్షుడిగా సంతోష్(కేశవపురం పాఠశాల), ఉపాధ్యక్షుడిగా డి దయ (రాజు నాయక్ తండా పాఠశాల), ప్రధాన కార్యదర్శిగా జి మల్లేశం (గట్టికల్ పాఠశాల), కోశాధికారిగా కృష్ణమూర్తి (తిర్మలాయపల్లి పాఠశాల), కార్యదర్శులుగా శశిధర్, హరిజ, వెంకటరమణ, రవీందర్, జోష్నలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ కమిటీ 2023 – 2024 సంవత్సరానికి గాను పనిచేస్తుందని వివరించారు.