టీటీడీపీ కార్యకర్త మృతి…

– అంతిమ సంస్కారానికి రూ.10 వేలు అందజేత….
– నివాళులు అర్పించిన నాయకులు కట్రం స్వామి…
నవతెలంగాణ – అశ్వారావుపేట : మండల పరిధిలోని వినాయక పురం కు చెందిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్త వాకలపుడి సూర్యారావు అనారోగ్యం తో గురువారం తన స్వగృహంలో మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఇంచార్జి కట్రం స్వామి దొర సూర్యారావు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. మృతుడు వాకలపూడి సూర్యరావు ఇటివల తెలంగాణ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో టీడీపీ పార్టీ సభ్యత్వం తీసుకోవడంతో అంతిమ సంస్కారాలు ఖర్చుల నిమిత్తం పార్టీ సభ్యత్వం నిబంధనలు ప్రకారం సంక్రమించే రూ.10 వేలు, అతని కుటుంబ సభ్యులకు కట్రం స్వామి దొర అందజేశారు.టిడిపి పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి కుటుంబ సభ్యులు లాగా పార్టీ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నార్లపాటి శ్రీనివాసరావు,గ్రామ శాఖ అధ్యక్షులు ఉప్పల బ్రహ్మేంద్రరావు,యువ నాయకులు కొండపల్లి నాగేంద్ర పాల్గోన్నారు.