టీయూ క్రికెట్ ఛాంపియన్ యూనివర్సిటీ పీజీటీం

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్ కాలేజీ క్రికెట్ మెన్ టోర్నమెంట్ ఫిబ్రవరి 26 న ప్రారంభమై సోమవారం నాడు ముగిసింది. ఈ టోర్నమెంట్ లో ఉమ్మడి నిజామాబాదు జిల్లా నుండి 12 టీం లు  హోరాహోరీగా పాల్గొన్నాయి. సోమవారం ఫైనల్ మ్యాచ్ లో వర్సిటీ పి జి టిమ్ తో గిరిరాజ్ గవర్నమెంట్ కళాశాల  టీం తలపడగ టి యూ పి జి టీం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని, 20 ఓవర్లలో 157/4 పరుగులు సాధించి గిరిరాజ్ కళాశాల (154/9) టీం  పై గెలుపొంది  ఛాంపియన్షిప్ ను కైవసం చేసుకుంది. ఈ టోర్నమెంట్  ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతితి గా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి  క్రీడా కారులకు సర్టిఫికెట్, మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా  రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి మాట్లాడుతూ.. ఆటలోనైనా జీవితంలోనైనా ఆటుపోట్లు తప్పవని గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని తెలిపారు. క్రికెట్ ఆటలో 11 మంది క్రీడాకారులు  ఐకమత్యానికి గుర్తుగా జట్టు విజయానికి కృషి చేస్తరన్నారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తి తో ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఈ ముగింపు కార్యక్రమంలో  తెలంగాణ యూనివర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ డాక్టర్ బాలకిషన్, చీప్ గార్డెన్  డా. మహేందర్ , గిర్రాజ్ కళాశాల  ఫిజికల్ డైరెక్టర్  బాలమణి, డా. బి. ఆర్. నేత జూనియర్ అసిస్టెంట్ నరేష్, వివిధ కళాశాలల  క్రీడాకారులు పాల్గొన్నారు.