– భయపడకుండా ముందుకు వచ్చి చికిత్స తీసుకోవడమే వ్యాధి నివారణకు మార్గం
నవతెలంగాణ సూర్యాపేట కలెక్టరేట్: క్షయ వ్యాధిగ్రస్తులు భయం వీడి ముందుకు వచ్చి చికిత్స తీసుకుంటే వ్యాధినీ పూర్తిగా నివారించవచ్చని వెన్నెల ఆసుపత్రి డాక్టర్ మామిడి నరేష్, ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ రమేష్ చంద్ర లు అన్నారు. క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వెన్నెల ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం సదుల చెరువు మినీ ట్యాంక్ బండ్ పై 2కే మర్తన్ రన్ ను ప్రారంభించి మాట్లాడారు. క్షయ వ్యాధి పూర్తి నివారణ లక్ష్యంగా ర్యాలీ నిర్వహించి నట్లు పేర్కొన్నారు. క్షయ వ్యాధిపై భయం వీడి పరీక్షలకు ముందుకు రావాలని క్షయ వ్యాధికి మందులు వచ్చాయని భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఆరు నెలల కోర్సు తప్పకుండా వాడితో వ్యాధి నివారణ అవకాశం ఉందన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులు భయపడి చికిత్స తీసుకోకుంటే తమ వల్ల మరో 15 మంది వ్యాధికి గురయ్యే అవకాశం ఉందన్నారు. క్షయ వ్యాధి నివారణకు ప్రభుత్వం విశేష కృషి చ్చేస్తుందని క్షయా వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా మందులు పోషకాహారానికి 500 రూపాయలు బ్యాంకు అకౌంట్ లో జమ చేస్తుంది అన్నారు. ప్రతిరోజు 20వేల మంది వ్యాధికి గురవుతుండగా ప్రతి నిమిషానికి ముగ్గురు చొప్పున మరణిస్తున్నారని అన్నారు. క్షయ రోగులు చికిత్సకు భయపడకుండా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకొని వ్యాధిని నివారించుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా పట్టణంలో విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ప్రధానో బహుమతి అక్షర స్కూల్, ద్వితీయ బహుమతి ఎంఎమ్ స్కూల్, తృతీయ బహుమతి మాంటిస్సోరి స్కూల్ గెలుపొందినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్లు చంద్రశేఖర్, శ్రీనివాస్, వెన్నెల ఆసుపత్రి డైరెక్టర్ దయాకర్, సిబ్బంది నాగరాజు, రవి, శివ, నజీర్, శ్రీకాంత్, చైతన్య, సాయి తదితరులు పాల్గొన్నారు.