ఎవరూ టచ్‌ చేయని పాయింట్‌తో మంగళవారం

no one Untouched with the point Tuesdayఅజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న మరో సినిమా ‘మంగళవారం’. పాయల్‌ రాజ్‌పుత్‌, అజ్మల్‌ అమిర్‌ జంటగా నటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్‌ 17న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ముద్ర మీడియా వర్క్స్‌ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్‌ వర్మ .ఎం నిర్మిస్తున్నారు.
చిరంజీవి ట్విట్టర్‌ ద్వారా ఈచిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆన్‌లైన్‌లో ఆయన విడుదల చేయగా, ఆఫ్‌లైన్‌లో హీరో కార్తికేయ విడుదల చేశారు.
ఈ సందర్బంగా అజరు భూపతి మాట్లాడుతూ, ‘డార్క్‌ థ్రిల్లర్‌ ఇది. డిఫరెంట్‌ జోనర్‌ సినిమా తీశా. ఎవరూ టచ్‌ చేయని పాయింట్‌ టచ్‌ చేశా. మా నిర్మాతల గురించి చెప్పాలి. స్వాతి చాలా క్లాస్‌. ఆవిడ ఇటువంటి రా అండ్‌ రస్టిక్‌, మాస్‌ సినిమా ఒప్పుకొన్నప్పుడు నా సినిమా సక్సెస్‌. ఇది ఫిమేల్‌ ఓరియెంటెడ్‌ సినిమా అని అనను. మహిళలకు సంబంధించిన పాయింట్‌ టచ్‌ చేశాం. మా అన్నయ్య సురేష్‌ వర్మకి థ్యాంక్స్‌’ అని అన్నారు. ‘అజరు భూపతి కథతో ముద్ర మీడియా వర్క్స్‌ మీద ఫస్ట్‌ మూవీ తీయడం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్‌ టైమ్‌ కలిసినప్పుడు కథ ఎలా చెప్పారో… కలిసిన ప్రతిసారీ అది పెరిగింది తప్ప తగ్గలేదు. ఆయనపై నమ్మకం పెట్టి సినిమా చేశాం. సినిమాలో ఆర్టిస్టులు అందరూ బాగా నటించారు. సురేష్‌ లేకుండా మూవీ చేసేదాన్ని కాదు. అజనీష్‌ పాటలు, నేపథ్య సంగీతం లేకుండా సినిమా లేదు’ అని స్వాతి రెడ్డి చెప్పారు.
పాయల్‌ రాజ్‌పుత్‌ మాట్లాడుతూ, ‘నా జీవితంలో ముఖ్యమైన రోజు ఇది. ట్రైలర్‌ విడుదలైన కొన్ని క్షణాల్లో మంచి రెస్పాన్స్‌ వచ్చింది. నా కెరీర్‌ ఎటు వెళుతుందో తెలియని అనిశ్చితి ఉన్న సమయంలో ఈ సినిమా వచ్చింది. నన్ను ‘ఆర్‌ఎక్స్‌ 100’తో అజరు భూపతి లాంచ్‌ చేశారు. అది నా కెరీర్‌ని మార్చింది. ఇప్పుడు ‘మంగళవారం’లో అవకాశం ఇచ్చారు. మరోసారి ఆయన నన్ను లాంచ్‌ చేస్తున్నారు. ఆయనకు థ్యాంక్స్‌” అని అన్నారు.