నవతెలంగాణ-గోవిందరావుపేట
వరదల్లో సర్వస్వం కోల్పోయిన వారిని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని పసర గోవిందరావుపేటలో భారీ వర్షాలకు దెబ్బతిన్న ఇండ్లను శుక్రవారం సిపిఐఎం బృందం పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా తుమ్మల వెంకట్ రెడ్డి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధికంగా గోవిందరావుపేట మరియు పై ప్రాంతంలో అత్యధిక భారీ వర్షం 40 సెంటీమీటర్ల పైన పడినందున జులై 26న రాత్రి రెండు గంటల సమయంలో అందరూ పడుకున్న సమయంలో ఆకస్మికంగా వరదలు రావడం గతంలోఎన్నడూ లేని విధంగా ఈసారి వరదలు రావడం ప్రజలందరూ బిక్కుబిక్కుమని కట్టుబట్టలతో బయటకు వచ్చారని పేర్కొన్నారు ప్రధానంగా పసర 163 జాతీయ రహదారి ప్రక్కన ఉన్న లాకావత్ బిక్య కుటుంబానికి ఐదు తులాల బంగారం 30 వేల రూపాయలు తోపాటు పూర్తి ఇంటి సామాను మొత్తం వరదలు కొట్టుకుపోయిందని మహేందర్ రెడ్డి వెల్డింగ్ షాపు యజమానికి 10 లక్షల రూపాయల నష్టం జరిగిందని మరియు మద్దినేని శ్రీను వంద గొర్లు గడ్డి వాము కొట్టకపోయిందని పూర్తిగా మొత్తం ఇంట్లో సామాను మొత్తం పూర్తిగా వరదలు కొట్టుకుపోయిందని పేర్కొన్నారు అంతే కాకుండా అభ్యుదయ కాలనీలో కొంత భాగము మరియు పసర ఎస్సీ వాడా గోవిందరావుపేట దయ్యాలవా గు పక్కన వారు కూడా కట్టు బట్టలతో బయటకు వచ్చారని ఒక్కొక్క కుటుంబం లక్షల రూపాయలు నష్టపోయినారని ప్రభుత్వం వెంటనే సర్వే చేసి పూర్తిగా నష్టపోయిన కుటుంబాలకు డబ్బులు బెడ్ రూమ్ లు కేటాయించాలని వారి కుటుంబాలకు తక్షణ సాయం 25 వేల రూపాయలు క్వింటా బియ్యం వంట సామాగ్రిలు అందజేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుల పొదిల్లా చిట్టిబాబు, గొంది రాజేష్ మండల కార్యదర్శి తీగల ఆదిరెడ్డి, అంబాల మురళి ,కడారి నాగరాజు ముమ్మిడి ఉపేంద్ర చారి చిరు పల్లె జీవన్, సీతారామరాజు, అరుణ్ పిట్టల ,జి ట్టబోయిన రమేష్, తదితరులు పాల్గొన్నారు.