– మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య.
నవతెలంగాణ -తుంగతుర్తి: అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా తీర్చిదిద్దిన చరిత్ర బిఆర్ఎస్ పార్టీ దేనని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. మంగళవారం మండల పరిధిలోని సంగెం, గుడితండ, కేశవాపురం, కొట్టిపర్తి, అన్నారం గ్రామాలలో గడపగడపకు సంక్షేమ అభివృద్ధి పథకాలపై అవగాహన కల్పిస్తూ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలో మరోమారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. 2014 పూర్వం, 2014 తర్వాత రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ఈ తొమ్మిది సంవత్సరాలలో సాధించిన అభివృద్ధిని ప్రతి ఇంటికి వెళ్లి వివరించడం జరిగింది. గాదరి కిషోర్ కుమార్ హ్యాట్రిక్ విజయంతోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు బూత్ ఇన్చార్జిలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.