
తెలంగాణ యూనివర్సిటీ నాన్ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ (TUNTSA) ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు.నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బి.సాయ గౌడ్, ఉపాధ్యక్షులుగా జి విజయలక్ష్మి, జనరల్ సెక్రెటరీగా బి. భాస్కర్, జాయింట్ సెక్రటరీ గా బి. వినోద్ కుమార్, ట్రెజరర్ గా ఎస్ జ్యోతి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉమారాణి, ఈసీ మెంబర్లు గా ఏ మనోహర్ గౌడ్, శ్రీ వాణి లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల అధికారిగా, యూనివర్సిటీ ఫైనాన్స్ అధికారి ఖాదర్ మొయినుద్దీన్ వ్యవహరించారు. ఈ కమిటీ సభ్యుల కాలపరిమితి మూడు సంవత్సరాల పాటు కొనసాగనుందని అధ్యక్షులు బి సాయ గౌడ్ తెలిపారు.నూతనంగా ఎన్నికైన ఈ కమిటీని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ కనకయ్య లు అభినందించారు.