న్యూఢిల్లీ: టాటా మోటార్స్ కొత్తగా వాణిజ్య ట్రక్కుల కోసం టర్బోట్రాన్ 2.0 ఇంజిన్‌ను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. ఇవి అధిక ఇంధన పొదుపు సామర్థ్యం కలిగి ఉంటాయని ఆ సంస్థ పేర్కొంది. 19-42 టన్నుల శ్రేణీ ట్రక్కులకు వీటిని ఉపయోగించనున్నట్లు వెల్లడించింది. ఈ ఇంజిన్లను 70వేల గంటల పాటు 30 లక్షల కిలోమీటర్ల మేర పరిశీలిన చేసినట్లు తెలిపింది.