ఉరుములు పిడుగులకు కాలిపోయిన టీవీలు, ఫ్యాన్లు

TVs and fans burnt by thunder and lightningనవతెలంగాణ – కమ్మర్ పల్లి 

మండలంలోని రాజరాజేశ్వరి నగర్ లో శుక్రవారం రాత్రి ఉరుములు మెరుపులతో కురిసిన వర్షానికి పడ్డ పిడుగుల వల్ల గ్రామంలోని పలు ఇండ్లలోని ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయి. ఒక్కసారిగా వచ్చిన ఉరుములతో కూడిన పిడుగుల వల్ల  పలువురు ఇండ్లలో టీవీలు, ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్లు, ట్యూబ్ లైట్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. పిడుగుల వల్ల ఇండ్లలోని  ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోవడం మూలంగా వేలల్లో నష్టం వాటిల్లినట్లు పలువురు బాధితులు వాపోయారు. పిడుగు పడిన సమయంలో తమ ఇంట్లో నడుస్తున్న టీవీ ఒక్కసారిగా పొగలు వచ్చి మాడిపోయినట్లు అయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంట్లోనే రెండు ఫ్యాన్లు, మూడు ట్యూబ్ లు కూడా కాలిపోయినట్లు తెలిపాడు.