
తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక, ఎఐ.యస్.బి ఆధ్వర్యంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న నారాయణ కళాశాలను బంద్ చేయించడం జరిగిందని టి.వియు.వి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమావత్ లాల్ సింగ్ ఎ.ఐ.స్.బి రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేష్ రెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమావత్ లాల్ సింగ్ మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించిన ప్రభుత్వం ఆ నిబంధనలకు విరుద్ధంగా నారాయణ కళాశాల యాజమాన్యం మాత్రం అవేవి తమకు పట్టవంటూ ఆ కళాశాల మాత్రం తరగతులు నిర్వహిస్తున్నారు. వర్షం లో సైతం విద్యార్థులు కళాశాల కు రావాలంటే ఇబ్బందులు అవుతున్యాయని తల్లిదండ్రులు వాపోతున్న కళాశాల యాజమాన్యం పిల్లలను తరగతులకు పంపాలని వేదిస్తున్న ఆ కళాశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.