– పత్రికలు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలవాలి..
– మూడోసారి జిల్లా అధ్యక్షులుగా ఐతబోయిన రాంబాబు గౌడ్ ఎన్నిక.. కార్యదర్శిగా బుక్క రాంబాబు..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలపై పోరాడే ఏకైక సంఘం టిడబ్ల్యూజేఎఫ్ అని రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో ఘనంగా టిడబ్ల్యుజేఎఫ్ సూర్యాపేట జిల్లా మూడవ మహాసభలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎన్ని మారిన రాష్ట్రంలో జర్నలిస్టుల జీవితాలు ఆగమ్య గోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇవే కాకుండా జర్నలిస్టులపై దాడులు చేస్తూ వారిని నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దీనిని తెలంగాణ వర్కింగ్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. జర్నలిస్టులపై దాడులను నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక జీవో తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.జర్నలిస్టులకు గత ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా తాత్పర్యం చేశాయని అన్నారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వమైన జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. గత ప్రభుత్వం నిర్విజయం చేసిన మాదిరిగా ఈ ప్రభుత్వం చేస్తే తెలంగాణ వర్కింగ్ ఫెడరేషన్ ఊరుకునేది లేదని అన్నారు. అలాగే జర్నలిస్టుల కుటుంబాల కోసం ఎడ్యుకేషన్ సిస్టం లో ప్రత్యేక జీవో తీసుకువచ్చి అమలు చేయాలన్నారు.ఇటీవల కాలంలో అనారోగ్య సమస్యలతో మృత్యు వాత పడుతున్న జర్నలిస్టులకు ప్రభుత్వం నుండి ఎలాంటి ఎక్స్గ్రేషియా ఇవ్వడం లేదని వెంటనే అమలు చేసి వారి కుటుంబానికి బాసటగా నిలవాలన్నారు.వర్కింగ్ జర్నలిస్టులకు కనీస వేతన సదుపాయం కల్పించి సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రమాదవశాత్తు కానీ అనారోగ్య సమస్యతో గానీ చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా మంజూరు చేయాలన్నారు. అనంతరం నవతెలంగాణ ఉమ్మడి నల్లగొండ జిల్లా మేనేజర్ రాష్ట్ర నాయకులు పుప్పాల మట్టయ్య మాట్లాడుతూ జర్నలిజం అనేది మనలో మనకే పోటీ తత్వంగా మారిందని తెలిపారు. వర్కింగ్ లో ఉన్న జర్నలిస్టుకి అక్రిడేషన్ కార్డు తప్పకుండా ఇవ్వాలని, చిన్న పత్రిక పెద్ద పత్రిక అని గ్రేడ్ గ్రేడింగ్ చేసి మీకు జిల్లాకి రెండు మండలానికి ఒకటి ఇస్తామని కొన్ని పత్రికలు అంటున్నాయి, దీనికి సంబంధించి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ఒక జర్నలిస్టు సుప్రీంకోర్టుకు తీసుకపోవడంతో ప్రతి ఒక్క ఆ గ్రేడింగ్ సిస్టర్ ని రద్దు చేసి ప్రతి ఒక్క వర్కింగ్ జర్నలిస్ట్ కి అక్రిడేషన్ ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందని అన్నారు.జర్నలిస్టులకు ఇల్లులు కేటాయించే విషయంలో కూడా గత ప్రభుత్వం ఎన్నో సాగులు చెప్పిందని అన్నారు. ఇదే విషయమై సుప్రీంకోర్టు జడ్జి ఎన్వి రమణ అలాంటి కేసులని లేకుండా కొట్టివేసిందని తెలిపారు. దీనిపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రతి అర్హుడైన జర్నలిస్టుకి ఇండ్ల జాగా ఇప్పించాలని కోరారు.
జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక…
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీ డబ్ల్యూ జె జఫ్) జిల్లా అధ్యక్షులుగా ఐత బోయిన రాంబాబు గౌడ్,జిల్లా కార్యదర్శిగా బుక్క రాంబాబు, ఉపాధ్యక్షులుగా ఎస్ కె.జానీ,చల్లా రామారావు, ధరావత్ రవీందర్ నాయక్,సంయుక్త కార్యదర్శులు ఎరుకల సైదులు గౌడ్, టేకుల సుధాకర్,వంగాల వెంకన్న, కుర్ర గోపి, బి శ్రీనివాస్, తొట్ల ఉపేందర్, కోశాధికారిగా పాల్వాయి యామిని,జిల్లా కార్యవర్గ సభ్యులుగా రావుల రాజు,లింగమూర్తి, శ్యామ్, జగదీష్, అజయ్, పరమేష్, గుడిపూడి ప్రభాకర్, రెడ్డి బిక్షం రూథర్, శంకర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా సలిగంటి పుల్లయ్య, పి వెంకట్ రెడ్డి, బత్తిని వెంకటేష్,నేషనల్ కౌన్సిల్ సభ్యులుగా సట్టు శ్రీను, జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యులుగా పాల్వాయి జానయ్యను, రాష్ట్ర కమిటీకి నాయిని శ్రీనివాసన్ పంపాలని కమిటీ తీర్మానించింది. తెలంగాణ బ్రాడ్కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా లింగాల సాయి గౌడ్, కార్యదర్శిగా నందిపాటి సైదులు, కోశాధికారిగా వేల్పుల ప్రవీణ్, ఉపాధ్యక్షులుగా వెలుగు సైదులు, సహాయ కార్యదర్శిగా పుట్ట రాంబాబు,నాయిని రమేష్ లింగయ్యను ఎన్నుకున్నారు.