జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో టీయూడబ్ల్యూజే, ఐజేయూ ముందంజ

జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో టీయూడబ్ల్యూజే, ఐజేయూ ముందంజ – శేరిలింగంపల్లి ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో టీయూడ బ్ల్యూజె, ఐజెయూ ముందంజలో ఉన్నదని శేరిలింగంపల్లి ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. మంగళ వారం చందానగర్‌ పీజేఆర్‌ స్టేడియంలో జరిగిన నియో జకవర్గ యూనియన్‌ సమావేశంలో ఆయన మాట్లాడా రు.రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన ఇండ్ల స్థలాలు, ఇండ్లు,హెల్త్‌ కార్డులు తదతర హామీ లను వెంటనే నెరవేర్చాలన్నారు.ఇంటి స్థలం ఉన్న వారికి ప్రభుత్వం ఇస్తా మన్న రూ.5లక్షల ఆర్థికసాయం పథకాన్ని జర్నలిస్టు లకు వర్తింపజేయాలన్నారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తెస్తూ ప్రభుత్వానికి వారధిగాని లుస్తున్న జర్నలిస్టుల జీవితాలలో అంధకారం అలుముకుంటున్న దన్నారు. గురుకులాలలో జర్నలిస్టు పిల్లలకు ప్రత్యేక కోట కేటాయించాలన్నారు. ఈ సమావేశంలో ఐజేయూ నాయ కులు ఎండి సలీం పాషా, సీనియర్‌ జర్నలి స్టులు శ్యామ్‌, శ్రీనివాస్‌, తిరుపతి రెడ్డి, సత్యనారాయణ, జిల్‌ మల్లేష్‌, అనిల్‌ రెడ్డి, నగేష్‌, రాజు, సాద నరేష్‌, జర్నలిస్టులు పాల్గొన్నారు.