– మండలంలో సభ్యత్వ నమోదు
నవతెలంగాణ – పెద్దవంగర
జాతీయ స్థాయిలో జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా టీయూడబ్ల్యూజే (ఐజేయు) పనిచేస్తుందని ఆ సంఘం మహబూబాబాద్ జిల్లా కోశాధికారి బిజ్జల వెంకటరమణ, జిల్లా ఈసీ మెంబర్ గిరికత్తుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని సాయి గార్డెన్ లో నిర్వహించిన సమావేశంలో వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ రంగు లక్ష్మణ్ గౌడ్ తో కలిసి సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. సుదీర్ఘ పోరాటాల చరిత్ర కలిగి ఉన్న తమ సంఘం నిరంతరం జర్నలిస్టుల సంక్షేమం, మీడియా స్వేచ్ఛ, పరిరక్షణ కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తుందన్నారు. ఈ సంఘం తోనే తమకు న్యాయం జరుగుతుందనే బలమైన నమ్మకం జర్నలిస్టుల్లో ఉందని పేర్కొన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల సాధన కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు. త్వరలోనే మండల కమిటీని ఏర్పాటు చేసి సంఘం బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సుంకరి ఓంకార్, జాటోత్ దామోదర్, జాటోత్ సుధాకర్, బాలాజీ, రాజు, సదానందం, వేణు, రామ్మూర్తి, మల్లేష్, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.