రెండున్నర లక్షల ఎల్ఓసి అందజేత..

నవతెలంగాణ -నవీపేట్: మండలంలోని నిజాంపూర్ గ్రామానికి చెందిన ఇర్ప ప్రియాంకకు గుండె ఆపరేషన్ కోసం బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమెన్ 2: 50 లక్షల ఎల్ఓసిని గురువారం అందించారు. ప్రియాంక గుండె ఆపరేషన్ విషయమై సర్పంచ్ విజయ రమేష్ ఫోన్ లో సమాచారం అందించగా వెంటనే  స్పందించి మెరుగైన వైద్యం కోసం ఎల్ఓసి అందించి సహకరించినందుకు జెడ్పిటిసి సవిత బుచ్చన్న ఎంపీటీసీ కృష్ణ మోహన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.