గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు

గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టునవతెలంగాణ-ఎల్లారెడ్డిపేట
గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను రిమాండ్‌కు పంపినట్లు శుక్రవారం ఎల్లారెడ్డిపేట సీఐ శ్రీనివాస్‌, ఎస్‌ఐ రమాకాంత్‌లు తెలిపారు. ఎల్లారెడ్డిపేట గ్రామ శివారులోని దుమాల బ్రిడ్జి వద్ద గురువారం కొంత మంది వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారని సమాచారం రాగా సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఎస్‌ఐ రమాకాంత్‌ పోలీస్‌ సిబ్బందితో ఎల్లారెడ్డిపేటలో శివారులో ఉన్న దుమాల బ్రిడ్జి వద్దకు వెళ్లగా అక్కడ ఇద్దరు వ్యక్తులు అనుమాస్పదంగా తిరుగుతుండగా వారిని పట్టుకొని విచారించడం జరిగిందని సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. చింతకింది భానుచందర్‌, గోనే ఉదరు అను ఎల్లారెడ్డిపే టకు చెందిన వారు గత కొంతకాలం నుండి గంజాయికి బానిసలై, చెడు వ్యసనాలకు బానిసలై సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో గంజాయి అమ్ముతున్నారన్నారు. కరీంనగర్‌ నుండి గుర్తు తెలియని వ్యక్తి దగ్గర గంజాయి కొనుగోలు చేసి దానిని అధిక ధరకు ఎల్లారెడ్డిపేట గ్రామశివారులో పరిసరాల ప్రాంతాల వారికి అమ్ముతున్నారని తెలిపార న్నారు. గంజాయితో పాటు ఇద్దరిని అరెస్టు చేసి, కేసు నమోదు చేసి విచారణ జరిపి రిమాండ్‌ చేయడం జరిగిందన్నారు.