గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు అరెస్ట్‌

నవతెలంగాణ -మేడ్చల్‌
గంజాయి విక్రయించినా, సేవించిన ఎన్‌.డి.పీ.ఎస్‌ యాక్ట్‌ ప్రకారం కఠినమైన చర్యలు తప్పవని మేడ్చల్‌ ఎక్సైజ్‌ సీఐ నవనీత హెచ్చరించారు. అక్రమంగా గంజాయి విక్రయించేందుకు వెళ్తున్న శంకర్‌ భాగ్‌, సిబాకిలా అనే ఇద్దరు వ్యక్తులను విశ్వసనీయ సమాచారంతో సోమవారం శామీర్‌పేట్‌ మండల పరిధిలోని దేవరయంజాల్‌లో పట్టుకున్నామని తెలిపారు. వారి వద్ద నుంచి 3.5కేజీల ఎండుగంజాయి, రెండు మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. నిందితులు మేడ్చల్‌ పట్టణంలోని పారిశ్రామికవాడ, పలు ఇంజనీరింగ్‌ కళాశాలల వద్ద గంజాయిని విక్రయిస్తున్నట్టు చెప్పారు. వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచామని వెల్లడించారు.