
అక్రమంగా తరలిస్తున్న రూ.2.5లక్షల విలువ చేసే గంజాయిని ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి లో సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి అశ్వారావుపేట ఎక్సైజ్ సీఐ రాజశేఖర్ రావు, ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ సీఐ శ్రీనివాస్,ఎక్సైజ్ ఎస్సై రాజేశ్వరరావు తెలిపిన వివరాలా ప్రకారాం. ఖమ్మం పట్టణం ముస్తాఫానగర్ చెందిన ములకలపల్లి ఉదయ్,గోపిచంద్ తో పాటు మరో వ్యక్తి ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు లో 10 కిలోల గంజాయిని కొనుగోలు చేసి చింతూరు నుంచి కూనవరం వేలేరుపాడు మండలం మధ్య ఉన్న గోదావరిని రుద్రం కోట వద్ద రేవులో పడవ దాటించి అనంతరం ద్విచక్రవాహనాలు పై అశ్వారావుపేట మీదుగా ఖమ్మం తరలిస్తున్నారు.ఈ విషయాన్ని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుసుకున్న అధికారులు ఊట్లపల్లి వద్ద వాహనాలు తనిఖీలు చేపట్టారు.ఈ సమయంలో రెండు ద్విచక్ర వాహనాలు పై వస్తున్న ముగ్గురిని ఆపేందుకు ప్రయత్నించగా ఒకరు ద్విచక్రవాహనాన్ని వదిలి పారిపోయినట్లు,ఒకే వాహనంపై ప్రయాణిస్తున్న ఉదయ్,గోపిచంద్ పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయడంతోపాటు వారు తరలిస్తున్న గంజాయి, రెండు ద్విచక్ర వాహనాలను, ఒక చరవాణి ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పారిపోయిన వ్యక్తి వివరాలు పట్టుబడిన వారు చెప్పలేదని అధికారులు వివరించారు. పారిపోయిన వ్యక్తిని కూడా త్వరలోనే పట్టు కుంటామన్నారు. చింతూరు లో కిలో గంజాయి రూ.1500 కు కొనుగోలు చేసి ఖమ్మం లో రూ.25 వేలకు విక్రయిస్తున్నట్లు నిందోతులు తెలిపినట్లు అధికారులు చెప్పారు