నవతెలంగాణ – బెజ్జంకి
ఎన్నికల ప్రవర్తన నయమావళిని ఉల్లంఘిస్తూ ఓ రాజకీయ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న 106 మంది ఉద్యోగులపై వేటు వేస్తూ జిల్లా పరిపాలనాధికారి మిక్కిలినేని మనుచౌదరి ఉత్తర్వులు జారీ చేసిన విషయం విధితమే. వేటు పడిన 106 మంది ఉద్యోగుల్లో బెజ్జంకి మండలానికి చెందిన ఇద్దరు టీఏలు జహంగీర్, శ్రీనివాస్ ఉన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి జిల్లాలోని సెర్ప్, ఈజీఎస్ ఉద్యోగులతో సమావేశమయ్యారనే ఫిర్యాదు మేరకు ఉద్యోగులపై వేటు పడింది.