నవతెలంగాణ- డిచ్ పల్లి
డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మిట్టపల్లి తండా కు చెందిన బాదావత్ మళ్లేంధర్ తన ద్విచక్ర వాహనం పై భూక్యా మహేష్ తో కలిసి సాంపల్లి తండా నుంచి మిట్టపల్లి తండాకి వేస్తుండగా మండలంలోని యానాంపల్లి గ్రామం నుండి మిట్టపల్లి వైపు వెళ్లే రోడ్ పై గురువారం రంగ్ రూట్ లో వస్తున్న ద్విచక్ర వాహనం ఢీ కోనడంతో మళ్లేంధర్ ,మహేష్ లకు తీవ్ర గాయాలైనట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు. మళ్లేంధర్ భార్య బాదావత్ శిరీష ఫిర్యాదు మేరకు కేసు చేసి గాయాలపాలైన ఇద్దరికీ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి కి తరలించినట్లు ఎస్సై తెలిపారు.