విద్యుత్ షాక్ తగిలి రెండు గేదెలు మృతి..

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని చిన్నపూర్ గ్రామానికి చెందిన రెండు గేదెలు మామిడిపల్లి గ్రామ శివారులో విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం చిన్నాపూర్ గ్రామానికి చెందిన మాణిక్యం, భుమన్నల గేదెలు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ. లక్ష 20 వేలు ఉంటుందని అన్నారు. గేదెలు మేత మేసుకుంటు వెళ్లి స్థంభానికి గల సపోర్ట్ వైర్ కు సర్వీస్ వైర్ తగలడంతో మేతకు వెళ్లిన గేదెలు  సపోర్ట్ వైర్ కు తగిలి అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఇదంతా కూడా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమాని అంటున్నారు. వైర్లు కిందకు వెలడటంతో ఈ సంఘటన జరిగిందన్నారు. బాధితులకు తగిన న్యాయం చేయాలని గ్రామస్థులు కోరారు.