ఇద్దరు సెల్‌ ఫోన్‌ దొంగల అరెస్ట్‌

– రెండు సెల్‌ఫోన్‌లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం..
– సుల్తాన్‌ బజార్‌ ఏసీపీ శంకర్‌
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్‌
జల్సాలు కలవాటు పడి విలాసవంతమైన జీవితం కోసం దొంగతనాలను వత్తిగా చేసుకున్న ఇద్దరు పాత నేరస్తులను అరెస్టు చేసిన సంఘటన సుల్తాన్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. సుల్తాన్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుల్తాన్‌ బజార్‌ డివిజన్‌ ఏసీపీ శంకర్‌, ఇన్‌ స్పెక్టర్‌ శ్రీనివాసచారి, డీఎస్‌ ఐ నరేష్‌ లతో కలిసి వివరాలను వెల్లడించారు. యాకత్‌ఫుర ప్రాంతానికి చెందిన ఇబ్రహీం షేక్‌ రసూల్‌ ఖాన్‌, అబ్దుల్‌ అర్వాజ్‌ లు చిన్ననాటి స్నేహితులు జల్సాలకు అలవాటు పడిన వీరు సులువుగా డబ్బును సంపాదించాలనే క్రమంలో మొబైల్‌ ఫోన్‌ దొంగతనాలను, రాబరీ చేస్తూ జీవనం గడుపుతున్నారు. కాగా ఈనెల 15న వీరు చాదర్‌ఘాట్‌ లోని రోజ్‌ బేకరీ ప్రాంతంలో ఓ క్యాబ్‌ డ్రైవర్‌ వద్ద ఉన్న మొబైల్‌ ఫోన్‌ను, వాలెట్‌ను దొగిలించిఅక్కడి నుంచి పరారయ్యారు. అదేరోజు కోఠి స్టేట్‌ బ్యాంక్‌ లోని లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ ఫుట్‌పాత్‌ పక్కన ఓలా క్యాబ్‌ డ్రైవర్‌ ఫోన్‌ మాట్లాడుతుండగా డ్రైవర్‌ చేతిలోని ఫోను లాక్కొని పరారయ్యాడు. దీంతో క్యాప్‌ డ్రైవర్‌ మీర్జాపురి సన్నత్‌ సైమన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన క్రైమ్‌ సిబ్బంది సీసీ టీవీ ఫుటేజీలు, వివిధ కోణాలలో పరిశీలించిన అనంతరం మొబైల్‌ స్నాచింగ్‌ పాల్పడిన ఇబ్రహీం షేక్‌ రసూల్‌ ఖాన్‌, అబ్దుల్‌ అర్వాజుల్‌ ను మంగళవారం ఉదయం గుజరాత్‌ గల్లీలో చోరీ చేసిన మొబైల్‌ ను విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా క్రైమ్‌ పోలీసులు వారిని పట్టుకొని విచారించగా కోఠి పరిధిలో జరిగిన చోరి కాకుండా చాదర్‌ ఘాట్‌ లో జరిగిన మొబైల్‌ చోరీలను గుర్తించారు. ఇద్దరి నిందితుల వద్ద నుంచి రెండు సెల్‌ ఫోన్లను, ఒక వ్యాలెట్‌, ఒక టీవీఎస్‌ రైడర్‌ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులు పాత నేరస్తులు, గతంలో వీరిపై అబిడ్స్‌, ఫలక్‌ నామ, రైన్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌ లో కేసులు నమోదైయన్నారు. వీరిని రిమాండ్‌ తరలించారు.