– 15 తులాల బంగారం స్వాధీనం
నవతెలంగాణ-రాజేంద్రనగర్
ఇద్దరు చైన్ స్నాచర్లు అరెస్టు చేసి రిమాండ్‌కు తర లించిన సంఘటన మంగళవారం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం నాగర్ కర్నూ లు జిల్లా తిమ్మాజీపేట ప్రాంతానికి చెందిన మూడవత్ పాండు, మూడవత్ సవ్య ఈ ఇద్దరు వ్యక్తులు చాలా కా లంగా చైన్ స్నాచర్లు పాల్పడుతున్నారు. గతవారం బు ద్వేల్ బస్‌స్టాప్‌లో బస్సు కోసం ఎదురుచూస్తున్న మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును ఈ ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి లాక్కొని వెళ్ళిపోయారు. కేసు నమోదు చేసు కున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా సమీపంలోని సీసీ టీవీ పరిశీలించగా గతంలో చైన్ స్నాచింగ్ పాల్పడి జైలుకు వెళ్లి వచ్చిన మూడవత్ పాండు, మూడవత్ సవ్య గా పోలీసులు గుర్తించారు. ఈరిద్దరిని మంగళవారం అ దుపులోకి తీసుకొని విచారంగా విచారించగా రాజేంద్రన గర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 6 ఆరు ప్రాంతాల్లో చైన్స్ స్నాచింగ్ పాల్పడ్డామని మీరు పోలీస్ విచారణలో తెలి పారు. వీరి వద్ద నుంచి 15 తులాల బంగారు గొలుసుల ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 11 లక్షలు ఉంటుంది. అయితే గతంలో పాండుపై 21 కేసు లు, సవ్య పై 18 కేసులు ఉన్నాయని వీరిపై గతంలో పీడీ యాక్ట్ నమోదయి జైలుకు కూడా వెళ్ళొచ్చారు. జైలుకు వెళ్లి వచ్చిన వీరి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు మ రోసారి వీరిపై పీడియాక్ టు నమోదు చేయడానికి ప్రయత్నిస్తున్నామని డీసీపీ తెలిపారు.