విద్యుత్ షాక్ తో రెండు పాడి గేదెలు మృతి..

నవతెలంగాణ – తాడ్వాయి
మండలంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన పిట్టల పోశాలు, మల్లబోయిన కృష్ణులకు చెందిన రెండు పాడి గేదెలు విద్యుత్  షాక్ తో మృతి చెందిన సంఘటన  శుక్రవారం చోటు చేసుకుంది. కామారం శివారులో మేత కోసం వెళ్లడంతో మినీ  ట్రాన్స్ఫార్మర్ వైర్లకు తాలిగి రెండు పాడి గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. బాధిత రైతులు రెండు గేదెల విలువ సుమారు 50 వేలు ఉంటుందని ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని రైతులు కోరారు.