
నిండు జీవితానికి రెండు చుక్కలు అని నందికొండ 3వ వార్డు కౌన్సిలర్ శిరీష మోహన్ నాయక్ అన్నారు. ఆదివారం నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని 3వవార్డు లోని అంగన్వాడి కేంద్రంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పల్స్ పోలియో మహమ్మారి నుంచి పిల్లలను కాపాడుకునేందుకు ఏటా ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమం చేపడుతొందని దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, అప్పుడే పుట్టిన పిల్లల నుండి ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలను తప్పక వేయించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం అందుబాటులో లేనివారు సోమవారం,మంగళ వారాల్లో వైద్యారోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సుధా,పుష్ప,కోప్పిశెట్టి నరసింహారావు(చిన్ని),వల్లపు రెడ్డి, ఊర శ్రీనివాస్, మరియు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.