ఉత్తమ సేవల పురస్కారాలు అందుకున్న ఇద్దరు జిపి సెక్రటరీలు, ఒకరు ఏపీవో..

Two GP secretaries received best service awards, one is APO.నవతెలంగాణ – మద్నూర్

మద్నూర్ మండలంలో విధులు నిర్వహించే మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీ గ్రామ కార్యదర్శి సందీప్ కుమార్ నూతనంగా ఏర్పడిన డోంగ్లి మండలంలోని హసన్ టాక్లి గ్రామ కార్యదర్శి సాయి కృష్ణ మద్నూర్ ఉమ్మడి మండల ఉపాధి హామీ ప్రోగ్రాం అధికారి పద్మ స్వతంత్ర వేడుకల్లో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సేవల పురస్కారాలు అందుకున్నారు. ఈ ముగ్గురు వారి విధుల్లో ఉత్తమంగా సేవలు అందించడం వారికి పురస్కారాలు ప్రభుత్వం తరఫున అందించడం ఉమ్మడి మండల ప్రజలు పురస్కారాలు అందుకున్న సందీప్ కుమార్ కు సాయి కృష్ణకు పద్మ మేడంకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నారు. మీ సేవలే ఉత్తమ పురస్కారాలకు ిదర్శనమని మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.