రెండు లైసన్స్… ఒక్క వైన్స్

నవతెలంగాణ – జుక్కల్

మండల కేంద్రాకి రెండు వైన్స్ దుకాణాలకు గాను ప్రభూత్వం రెండింటికి అనుమతి ఇవ్వడం జర్గింది. డిసెంబర్ 1వ తేదిన హంగు ఆర్బాటాలతో  మద్యదుకాణాలను పూజలు నిర్వహించి అమ్మకాలు నిర్వహించారు. సిట్టింగ్ లకు పర్మిట్  స్థలం కేటాయించక పోవడంతో  కొన్నిరోజులు బహిరంగ ప్రదేశంలో ఎక్కడపడితే అక్కడ మద్యసేవించి బాటిళ్లను పడేస్తున్నామని మద్యం సేవించే వ్యక్తులు తెలిపారు. తీరా చూస్తే రెండు మద్యం దుకాణాలలో అమ్మకాలు చేపట్టకుండా  సిండికేట్ ఎర్పడి ఒకే దుకాణంలో అమ్మకాలు చేయడం తో ప్రజలు అబ్యంతరం వ్యక్తంచేస్తు అగ్రహంగా ఉన్నారు. మద్యం దుకాణాలు ఇష్టం వచ్చినట్టు వ్వవహరించడం జర్గుతోందని మండల వాసులు ఆరోపణలు చేస్తున్నారు. పట్టించుకోవాల్సిన ఎక్సైజ్ అధికారులు వైన్స్ దుకాణాల వారి అడుగులకు మడుగులు వేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇట్టి విషయాన్ని ఎక్సైజ్ సిఐ సత్యనారాయణ కు చరవాణి ద్వారా మాట్లాడేందుకు ప్రయత్నిస్తే అన్ చేయక మాట్లాడ లేదు. ఇప్పడికైన జిల్లా అధికారులు స్పందించి సంభందిత మద్యం దుకాణాల పైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని మండల వాసులు కోరుతున్నారు.