అక్రమ ఇసుక రవాణాపై కొరడా.. రెండు లారీలు సీజ్

Whip on illegal transport of sand.. Two lorries seizedనవతెలంగాణ – మద్నూర్
మంజీరా నది నూతనంగా ఏర్పడిన డోంగ్లి మండల పరిధిలో ఉంది ఈ మంజీరా నది నుండి అక్రమంగా ఇసుక రవాణా కొనసాగుతుంది అనడానికి ఆదివారం నాడు అధికారులకు పట్టుబడ్డ రెండు ఇసుక లారీలే నిదర్శనం మంజీరా నది నుండి పెద్ద మొత్తంలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది. అనడానికి పట్టుబడ్డ లారీలే నిదర్శనంగా చెప్పుకోవచ్చు అధికారులు పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ పకడిబందీగా నిగా పెడుతూ అక్రమ ఇసుక రవాణాపై కొరడ జరిపిస్తున్నారు. అనడానికి పట్టుకున్న రెండు లారీలే నిదర్శనం పట్టుబడ్డ లారీలను పోలీస్ స్టేషన్ కు తరలించి సీజ్ చేశారు. అధికారుల కొరడా పట్టుకున్న లారీల పట్ల బాగుంది అంటూనే ప్రజల్లో భిన్నంగా ఆవేదన వ్యక్తం అవుతుంది. కొందరు ఎలుకలను బట్టి ఏనుగులను వదులుతున్నారు అంటారు. ఇక్కడ అలా కాదు ఏనుగులను బట్టి ఎలుకలను వదులుతున్నారని ఆవేదన ప్రజల్లో వ్యక్తం అవుతుంది. అక్రమ ఇసుక రవాణా పట్ల ముచ్చటగా మూడు మండలాలకు అక్రమ ఇసుకదారులు అధికారుల కండ్గప్పి రాత్రింబవళ్లు నడిపిస్తున్నారని ఆరోపణలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. మంజీరా నది ఇటు డోంగ్లి అటు పొతంగల్ కోటిగీర్ మండలాలకు పరిసరాల ప్రాంతాల్లో ఉంది మంజీరా నది పరివాహక మండలాలకు అక్రమ ఇసుక రవాణా కంటిమీద చూపు లేకుండా చేస్తుంది అధికారులు రాత్రింబవళ్లు నిగా పెట్టవలసిన దుస్థితి ఏర్పడింది పట్టుబడ్డ రెండు లారీలు పట్టపగలే పట్టుకున్నారు. అది కూడా డోంగ్లి పోతంగల్ కోటగీర్ అధికారులు కాకుండా మద్నూర్ మండలం పోలీస్ శాఖ రెవెన్యూ శాఖల అధికారులు పకడ్బందీ నిఘాతో పట్టుకోవాల్సి వచ్చింది. ఆ మూడు మండలాల అధికారులు మంజీరా నదిపై ఎలాంటి నిఘా పెట్టడం లేదు. అనడానికి మద్నూర్ మండల్ అధికారులకు పట్టుబడ్డ లారీలే నిదర్శనం మంజీరా నదిలో అక్రమ ఇసుక రవాణా జోరుగా కొనసాగుతున్నట్లు మండల ప్రజల్లో ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇకనైనా మంజీరా నది నుండి అక్రమంగా ఇసుక తరలిపోకుండా ఇటు డోంగ్లి మండల రెవెన్యూ శాఖ అటు పోతంగల్ కోటగిరి సంబంధిత శాఖల అధికారులు నిగా పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.