– ఇద్దరు కీలక నేతల జంప్
– ఒకరు మాజీ డిప్యూటీ మేయర్, వక్ఫ్ బోర్డ్ చైర్మన్
నవతెలంగాణ – కంఠేశ్వర్
స్థానిక ఎన్నికల సమయం సమీపిస్తున్న ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ మరో ఝలక్ తగలబోతుంది. ఇద్దరు కీలక నేతలు పార్టీ ని వీడి ఎంఐఎం పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరిగింది. మాజీ డిప్యూటీ మేయర్ మీర్ మజాజ్ అలీ తో పాటు మాజీ వక్స్ బోర్డు ఛైర్మెన్ ఫయాజ్ లతో పాటు అమర్ లు బిఆర్ఎస్ ను విడనున్నారు. వారు ముగ్గురు యంఐయం పార్టీలో చేరనున్నారు అని అనుకుంటున్నా లోపే ఆదివారం ఎంఐఎం పార్టీ అధినేత హాసదొద్దీన్ ఒవైసీ ను ఉదయం కలిసినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆయన సమక్షంలో దారుస్సలాం లో పచ్చ కండువా వేసుకొన్నారు అని ప్రచారం కొనసాగుతుంది.